WPL 2023 Final | నేడే డబ్ల్యూపీఎల్ ఫైనల్.. ఢిల్లీ, ముంబైలో ఛాంపియన్‌గా నిలిచేది ఎవరో?
WPL 2023 Final | దాదాపు నెలరోజులుగా అభిమానులను అలరిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి అంకానికి చేరుకుంది. ఫోర్లు, సిక్సర్ల జోరులో ముంచెత్తిన డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఫైనల్‌కు నేడే తెరలేవనుంది.
WPL 2023 Final | ముంబై: దాదాపు నెలరోజులుగా అభిమానులను అలరిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి అంకానికి చేరుకుంది. ఫోర్లు, సిక్సర్ల జోరులో ముంచెత్తిన డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఫైనల్‌కు నేడే తెరలేవనుంది. లీగ్ దశలో టాప్‌లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో.. ఎలిమినేటర్ విజేత ముంబై ఇండియన్స్ తలపడనుంది.
సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన ఇరు జట్లే ఫైనల్ చేరగా.. సమ ఉజ్జీల పోరులో హోరాహోరీ సమరం ఖాయమే. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉంటే.. టాపార్డర్ దుమ్మురేపుతుండటం ఢిల్లీకి కలిసి రానుంది. హర్మన్‌తో పాటు యస్తిక, హీలీ మాథ్యూస్, స్కీవర్ బ్రంట్, అమెలియా కెర్,్ర పూజ వస్ర్తాకర్, ఇస్సి వాంగ్, సైకా ఇషాఖ్తో ముంబై పటిష్టంగా కనిపిస్తున్నది. మరోవైపు కెప్టెన్ మెగ్ లానింగ్‌తో పాటు విధ్వంసక ఓపెనర్ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మరినె కాప్, కాప్సీ, జాన్సెన్‌తో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్భేద్యంగా ఉంది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమంగా కనిపిస్తున్నా.. ఒత్తిడిని జయించి ఎవరు తొలి టైటిల్ చేపడతారనేది ఆసక్తికరం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

