IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రెండు వారాల క్రితం 8వ స్థానంలో ఉన్న ముంబై.. వరుసగా ఐదు విజయాలతో టాప్ -4లో చోటు సంపాదించింది. గతంలో ఐదుసార్లు ట్రోఫీని ఒడిసిపట్టిన ముంబై జట్టు ఈ దఫా కూడా ఛాంపియన్‌గా నిలిచే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీఎల్‌లో ట్రోఫీ గెలవకుండా వందల కొద్దీ పరుగులు సాధించడం వల్ల ప్రయోజయం ఉండదని హిట్‌మ్యాన్ అన్నాడు.
ఐపీఎల్లో అందరూ ఒక బ్యాటర్ ఎన్ని పరుగులు సాధించాడు అనేదే చూస్తారు. రికార్డులు బద్ధలు కొట్టే ఆటగాళ్లను పొగడ్తల్లో ముంచెత్తుతారు. అయితే.. ఇవన్నీ తనకు ఏమాత్రం నచ్చవు అంటున్నాడు ముంబై మాజీ సారథి రోహిత్. ‘నా దృష్టిలో 600 నుంచి 700లకు పైగా రన్స్ చేయడం గొప్ప కాదు. ట్రోఫీ గెలవడం ప్రధానం. ఇన్నేసి పరుగులు చేసినా ఛాంపియన్ అనిపించుకోకుంటే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరేగా’ అని హిట్‌మ్యాన్ వెల్లడించాడు. అంతేకాదు మిగతా బ్యాటర్ల మాదిరిగా తన లక్ష్యం పరుగులు చేయడం కాదని చెప్పేశాడీ డాషింగ్ బ్యాటర్.
‘ఒక సీజన్లో ఇన్ని రన్స్ చేయాలి అని టార్గెట్ పెట్టుకోను. నిజం చెప్పాలంటే అలాంటివి నాకు ఏమాత్రం ఇష్టముండవు. నాకు మ్యాచ్‌లు గెలవడమే ముఖ్యం. మైదానంలోకి దిగిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నా. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలోనే నేను సెంచరీలతో చెలరేగాను. కానీ, అనూహ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్(Newzealand) చేతిలో ఓడిపోయాం. అప్పుడే నాకు రన్స్ ముఖ్యం కాదు మ్యాచ్‌లు గెలవడం ప్రధానమని అర్ధమైంది’ అని రోహిత్ వివరించాడు. ఫుల్షాట్లకు కేరాఫ్ అయిన రోహిత్ ఏప్రిల్ 30న 38వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసింది.
The pride of a billion.
The captain of the nation. 🇮🇳
Happy Birthday, Rohit Sharma! 🎂 #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/82OnC2iho0— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2025
పద్దెనిమిదో ఎడిషన్‌లో ఆలస్యంగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రెండుసార్లు ఓడించిన ముంబై.. కోల్‌కతా, ఢిల్లీలకు చెక్ పెట్టి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. ఓపెనర్‌గా రోహిత్ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టు గెలుపులో కీలకం అవుతున్నాడు. ఈ సీజన్లో రెండు అర్థ శతకాలు బాదిన అతడు 9 మ్యాచుల్లో 156.86 స్ట్రయిక్ రేటుతో 240 పరుగులు చేశాడు. ప్లే ఆఫ్స్‌కు ముంబై తదుపరి పోరులో భాగంగా గురువారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో తలపడనుంది.
Up next ⏳
Match 5⃣0⃣ of #TATAIPL 2025@rajasthanroyals🆚 @mipaltan
What are your predictions for the #RRvMI contest? 🤔 pic.twitter.com/2b4kr5Kted
— IndianPremierLeague (@IPL) May 1, 2025