బడంగ్ పేట్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజులలో మహిళలకు ఇస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చలేదో మహిళలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indra Reddy ) డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి ( Kalyanalaxmi ) , షాదీ ముబారక్ ( Shadimubarak ) కు సంబంధించిన 83 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఆమె మాట్లాడుతూ చెక్కులు తీసుకున్న ప్రతి ఒక్కరూ తులం బంగారం( Gold ) ఏది అని ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే వరకు పోరాడుతామని తెలిపారు. కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని మహిళలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ఆరు నెలల ముందు ఏదైనా పథకాన్ని అమలు చేయాలనుకున్నా కల్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన వారందరికీ తులం బంగారం ప్రభుత్వం బాకీ ఉందన్నారు. ఏదో కాలయాపన చేసి ఎన్నికల ముందు తూతు మంత్రంగా చేస్తామంటే కుదరదు అన్నారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తామన్నారు. మహిళలకు ఇచ్చిన మరో హామీ 2500 ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
కేసీఆర్ కిట్టును ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. మహిళలను కోటీశ్వరులు చేస్తామని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కోటి మంది మహిళలు ఉన్నారని వారిలో ఒక్కరినైనా కోటీశ్వరులు చేశారా చూపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బాలాపూర్ ఎమ్మార్వో, మిర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జ్ఞానేశ్వర్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, అరకల భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, శీను నాయక్, బొక్క రాజేందర్ రెడ్డి, మదారి రమేష్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి,అవినాష్, మాచర్ల, మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్, పంతంగి మాధవి, విజయలక్ష్మి, డీటీ మణిపాల్ రెడ్డి, ఆర్ఐ ప్రశాంతి, కమిషనర్ జ్ఞానేశ్వర్, ఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.