IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో యజ్వేంద్ర చాహల్(Yazvendra Chahal) తొలి హ్యాట్రిక్ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో జరిగిన మ్యాచుల్లో వరుస బంతుల్లో దీపక్ హుడా, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ వీరుడిగా రికార్డు నెలకొల్పాడు యుజీ. తన సంచలన బౌలింగ్‌తో చెన్నైని 200లోపే కట్టడి చేసి. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన చాహల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడి ప్రేయసిగా వార్తల్లో నిలుస్తున్న ఆర్జే మహవేశ్(RJ Mahvesh) స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఇంతకూ తను ఆ పోస్ట్‌లో ఏం రాసిందో తెలుసా?
ఇక టీ20ల్లో కథ ముగిసిపోయింది అనుకున్న వేళ.. గోడకు కొట్టిన బంతిలా పుంజుకున్నాడు చాహల్. ఆరంభ మ్యాచుల్లో సత్తా చాటలేకపోయిన చాహల్ రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. కోల్‌కతా, ఆర్సీబీలపై రెచ్చిపోయిన ఈ లెగ్ స్పిన్నర్.. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌పై హ్యాట్రిక్‌తో మెరిశాడు. 200ల స్కోర్కుపైగా కొట్టేలా కనిపించిన సీఎస్కేను 191కే కట్టడి చేయడంలో యుజీ సఫలం అయ్యాడు. అనంతరం తనదైన ‘సిగ్నేచర్ స్టయిల్’ సెలబ్రేషన్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.
𝙒.𝙒.𝙒 🤯
First hat-trick of the season 😍
Second hat-trick of his IPL career 🫡Yuzvendra Chahal is his name 😎
Updates ▶ https://t.co/eXWTTv8v6L #TATAIPL | #CSKvPBKS | @yuzi_chahal pic.twitter.com/4xyaX3pJLX
— IndianPremierLeague (@IPL) April 30, 2025
దాంతో, చాహల్ నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ఆర్జే మహవేశ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘గాడ్ మోడ్ ఆన్ క్యా.. ఒక యోధుడి బలం ఇది’ అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ. దాంతో.. మరోసారి వీళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందే భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Varma)కు విడాకులు ఇచ్చేసిన చాహల్ స్నేహితురాలైన మహవేశ్తో సన్నిహితంగా ఉంటున్నాడు. వీళ్లిద్దరూ టీమిండియా మ్యాచుల్లో జంట పక్షుల్ల స్టేడియాల్లో కనిపించి సందడి చేశారు. ఆ తర్వాత ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి మహవేశ్ తన ఫ్రెండ్ అయిన చాహల్‌కు మద్దతుగా ఉంటూ వస్తోంది. అతడు మైదానంలో అద్భుత ప్రదర్శన చేసిన ప్రతిసారి ఇన్‌స్టా పోస్ట్‌లతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటివరకూ 18వ ఎడిషన్‌లో ఆడిన 10 మ్యాచుల్లో చాహల్ 9.43 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ ప్రదర్శన 4-28.