జహీరాబాద్, మే 1 : జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాల్కల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు సిద్ధి లింగయ్యస్వామి అన్నారు. గురువారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం కార్యాలయ అవరణలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల వద్దకు తీసుకెళ్లి మోసపోకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్మాలన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శాంత్కుమార్పాటిల్, గురుపుత్ర, బీర్గోండ, కార్యదర్శి బస్వారాజ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.