IPL 2025 : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సొంత మైదానంలో మర్చిపోలేని బహుమతి అందుకున్నాడు. తన అడ్డా అయిన వాంఖడేలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని(Roger Binni) చేతుల మీదుగా ప్రత్యేక జ్ఞాపికను స్వీకరించాడు హిట్‌మ్యాన్. ఐపీఎల్లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రోహిత్‌ను మెమెంటోతో గౌరవించింది బీసీసీఐ.
గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ 18 అని రాసున్న జ్ఞాపికను అందుకున్న రోహిత్ మురిసిపోయాడు. ఈమధ్యే వాంఖడేలోని ఒక స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
1️⃣8️⃣ seasons 🤝 1️⃣ Legacy
Rohit Sharma of the Mumbai Indians receives a special memento from BCCI President, Mr. Roger Binny 💙#TATAIPL | #MIvSRH | @mipaltan | @ImRo45 pic.twitter.com/dXANupM8Sb
— IndianPremierLeague (@IPL) April 17, 2025
ఐపీఎల్ ఆరంభం నుంచి రోహిత్ విరామం లేకుండా ఆడుతున్నాడు. మొదట్లో దక్కన్ ఛార్జర్స్(Deccan Chargers)కు ఆడిన రోహిత్ 2011లో ముంబై ఇండియన్స్‌కు మారాడు. 2013లో సారథిగా ఎంపికైన రోహిత్.. ముంబైని ఏకంగా ఛాంపియన్‌గా నిలిపాడు. 2015, 2017, 2019, 2020లో అతడి కెప్టెన్సీలో ముంబై ట్రోఫీని ముద్దాడింది.
అయితే.. మేనేజ్మెంట్ నిర్ణయం కారణంగా నిరుడు హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు పగ్గాలు అప్పగించిన ఈ రన్ మెషీన్.. బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ విధ్వంసక ఓపెనర్లలో ఒకడైన రోహిత్.. 2 సెంచరీలు, 43 అర్ధ శతకాలతో కలిపి 6,684 పరుగులు సాధించాడు. తనకు ఎంతో అచ్చొచ్చిన ఈ మైదానంలో ఈ మాజీ సారథి 1000 సిక్సర్లు బాదాడు.