IPL 2025 : సొంతమైదానంలో 163 పరుగుల ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు పెద్ద షాక్. సిక్సర్లతో విరుచుకుపడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మ(26) ఔటయ్యాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఫుల్‌టాస్ బంతిని ఆడిన అతడు.. నేరుగా ట్రావిస్ హెడ్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 32 వద్ద ముంబై తొలి వికెట్ పడింది. ప్రస్తుతం రియాన్ రికెల్టన్(5), విల్ జాక్స్(0)లు క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లకు స్కోర్.. 32-1.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(40) మెరుపు ఆరంభాన్ని ఇవ్వడంతో మరోసారి భారీ స్కోర్ ఖాయం అనిపించింది. కానీ, పవర్ ప్లే తర్వాత ముంబై బౌలర్లు అనూహ్యాంగా పుంజుకొని.. వరుసగా వికెట్లు తీశారు. స్లో పిచ్ మీద పెద్ద షాట్లు ఆడలేకపోయారు. అయితే.. హెన్రిచ్ క్లాసెన్(37) ఆఖర్లో అనికేత్ వర్మ (18) మెరుపులతో 160 దాటించారు. ఆఖరి మూడు ఓవర్లలో 47 రన్స్ రావడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.