Rakesh Reddy | గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వొద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై బీఆర్ఎస్ నేతల రాకేశ్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అంతిమ విజయం ధర్మానిదే అని మరోసారి నిరూపితమైందన్నారు. హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని.. ఇది గ్రూప్-1 అభ్యర్థులు, విద్యార్థుల పోరాట ఫలితానికి వచ్చిన ఫలితమన్నారు. విద్యార్థులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయమన్నారు. గ్రూప్-1లో అవకతవకలు జరిగాయంఏట.. అంటే టీజీపీఎస్సీలో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నోటీసులు ఇచ్చాని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేస్తూ క్షమాపణలు చెప్పాలని అన్నారని.. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో దిమ్మతిగిందన్నారు. బండారం అంతా బయటపడే సమయం ఆసన్నమైందని.. 15 నెలల కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించడంలో బీఆర్ఎస్ ప్రతీసారిపై చేయి సాధిస్తుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఆగమేఘాలపై తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారన్నారు. ఫలితాలతో పాటు, పరీక్షల నిర్వహణలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయని.. అన్నింటినీ హైకోర్టు సునిశితంగా పరిశీలించి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తుందని, అవకతవకలకు పాల్పడ్డ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులపై చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. ఇది ఆరంభం మాత్రమే, ముందుంది ముసళ్ల పండగ.. ఒక్కొక్కటి అన్నీ బయటకి వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులే మైకుల ముందు తనవాళ్లకు ఉద్యోగాలు ఇప్పించుకోవడంపై చర్చించుకుంటున్నారని.. కాంగ్రెస్లో ఈ సంస్కృతికి సర్వ సాధారణమన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖల మాటామంతీ నిరుద్యోగుల్లో, గ్రూప్-1 అభ్యర్థుల్లో ఇంకెక్కువ అనుమానాలు రేకెత్తిస్తుందన్నారు. అదే పద్ధతితో గ్రూప్-1లో కూడా ఫలితాలు వెల్లడి అయినట్లు అనుమానాలు ఉన్నాయని.. బీఆర్ఎస్ పార్టీ పక్షాన గ్రూప్-1 అభ్యర్థుల పక్షాన నిలపడి బలంగా కొట్లాడుతామన్నారు. అంతిమ విజయం సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదన్నారు.