IPL 2025 | ఐపీఎల్లో వెయ్యి పరుగులు.. రెండో బ్యాటర్‌గా హెడ్ రికార్డు
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో చెలరేగి ఆడుతున్న సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) రికార్డు నెలకొల్పాడు. ఈ ఎడిషన్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో చెలరేగి ఆడుతున్న సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) రికార్డు నెలకొల్పాడు. ఈ ఎడిషన్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. బంతులు తీసుకున్నాడంతే. 575 బంతుల్లో వెయ్యి క్లబ్లో చేరాడీ చిచ్చరపిడుగు. గురువారం ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల చేసిన హెడ్.. థౌజండ్‌వాలా అనిపించుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో తక్కువ బంతుల్లోనే వెయ్యి రన్స్ చేసిన ఆటగాళ్లు ఐదుగురు ఉన్నారు. ఈ జాబితాలో కరీబియన్ క్రికెటర్ ఆండ్రూ రస్సెల్(Andrew Russel) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న ఈ డేంజరస్ బ్యాటర్ కేవలం 545 బంతుల్లో ఈ మైలురాయికి చేరుకున్నాడు.
Travis Head the second-fastest batter to score 1000 IPL runs in terms of balls faced 🙌#IPL2025 #IPL #TravisHead #SRH pic.twitter.com/ESJ60Ou16z
— Circle of Cricket (@circleofcricket) April 17, 2025
హెడ్ రెండో స్థానంలో ఉండగా.. హెన్రిచ్ క్లాసెన్, వీరేంద్ర సెహ్వాగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్.. వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. సన్‌రైజర్స్ తరఫున విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న క్లాసెన్ 594 బంతుల్లో 1,000 రన్స్ కొట్టాడు. మాజీ ఓపెనర్ వీరూ 604 బంతులు తీసుకున్నాడు. మ్యాక్సీ 610 బంతుల్లో వెయ్యి పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి
- MLC Kavitha | కేసీఆర్ కృషితోనే బంజారాల బతుకులు మారినయ్ : కవిత
- India slams Pak Army Chief’s comment | ‘కశ్మీర్‌ను మరిచిపోం’.. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
- Gampa Nageshwara Rao | ఉన్నత లక్ష్యంతో ముందుకు పోవాలి.. విద్యార్థులతో గంప నాగేశ్వరరావు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

