Gampa Nageshwara Rao |ఉప్పల్, ఏప్రిల్ 17 : విద్యార్థులు చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వర్ రావు అన్నారు. పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం హబ్సిగూడలోని వ్యాలీ వోక్ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన మూడు రోజుల వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది.
ఈ సందర్భంగా గంప నాగేశ్వరరావు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంతోపాటు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఒక లక్ష్యంతో ముందుకు పోవాలని సూచించారు. అనంతరం వ్యాలీ ఓక్ జూనియర్ కళాశాల డైరెక్టర్లు ప్రశాంత్ కుమార్, జె జగన్మోహన్ రావులు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఉజ్వల 2025 పేరుతో హబ్సిగూడలోని వ్యాక్ హోలీ జూనియర్ కళాశాలలో మూడు రోజులపాటు వ్యక్తిత్వ వికాస శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ తో పాటు, వ్యక్తిత్వ వికాస నిపుణులు తమ సలహాలు, సూచనలు విద్యార్థులతో పంచుకున్నారని పేర్కొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత