Rohit Sharma : పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ అధిపతి అయిన రతన్ టాటా (Ratan Tata) ఇక లేరనే వార్త అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా కన్నుమూసిన టాటా సేవల్ని, మేధస్సును కొనియాడుతూ సంతాపం తెలియజేస్తున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సైతం టాటాకు నివాళులు అర్పించాడు. ఆయనది బంగారం లాంటి మనసు అంటూ అని హిట్‌మ్యాన్ తెలిపాడు.
‘బంగారం లాంటి హృదయం గల మనిషి. సార్.. ఇతరుల జీవితాలను గొప్పగా మార్చాలని తపన పడిన మీరు ఎల్లకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారు’ అని ఎక్స్ వేదికగా రోహిత్ ఓ పోస్ట్ పెట్టాడు. టాటా గ్రూప్ చైర్ పర్సన్ అయిన రతన్ టాటా 86 ఏండ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ముంబైలోని క్యాండీ బ్రీచ్ దవాఖానలో చేరిన ఆయన.. గురువారం ఉదయం ఆ లోకాన్ని విడిచి వెళ్లారు.
A man with a heart of gold. Sir, you will forever be remembered as someone who truly cared and lived his life to make everyone else’s better. pic.twitter.com/afbAbNIgeS
— Rohit Sharma (@ImRo45) October 10, 2024
భారత జట్టును టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన రోహిత్.. ఇక టెస్టు గదపై గురి పెట్టాడు. స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్(Bangladesh)ను వైట్‌వాష్ చేసిన భారత్ తర్వాతి పోరులో న్యూజిలాండ్ సవాల్‌కు సిద్ధమవుతోంది. బంగ్లాపై సూపర్ విక్టరీతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైన్ల్ రేసులో టీమిండియా అగ్ర స్థానంలో ఉంది. ఇప్పటికే రెండుసార్లు ఫైనల్లో ఓడిన భారత్.. ఈసారి ఎలాగైనా టెస్టు గదతో స్వదేశం రావాలనే కసితో ఉంది.