అమరావతి : ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి (Dussehra Sharannavaratri ) ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు దుర్గాదేవి (Durga Devi) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీలు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి (Indrakiladri ) తరలివచ్చారు.
భక్తుల రద్దీ కారణంగా ఆలయ అధికారులు ఐదు వరసుల్లో దర్శనానికి అనుమతిస్తున్నారు. దసరా సేవా కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సారె, పట్టుచీర, సుమంగళ ద్రవ్యాలు సమర్పించారు. ఖడ్గమాలసేవ, కుంకుమ పూజలు, చండీయాగం ఇతర సేవలకు భక్తులు ప్రాధాన్యం ఇచ్చారు. కృష్ణానదిలో నీటి ఉద్దృతి దృష్ట్యా జలవిహారం ట్రయల్ రన్‌ను రేపటికి వాయిదా వేశారు. ఎమ్మెల్యే సుజనాచౌదరి(MLA Sujana Chaudhary) అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఏపీ ఆర్టీసీ చైర్మన్ నారాయణ, ఎంపీ కలిశెట్టి అమ్మవిఆరిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.