Ratan Tata | రతన్ టాటా (Ratan Tata) అంతిమ యాత్ర ( last rites) ప్రారంభమైంది. ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుంచి రతన్ టాటా పార్థివదేహాన్ని అంతియ యాత్రగా తీసుకెళ్తున్నారు. రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఆయన గౌరవ సూచికంగా గురువారం సంతాప దినంగా ప్రకటించారు. మరికాసేపట్లో వర్లీ ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే రతన్ టాటా పార్థివదేహానికి షా నివాళులర్పించారు. ఆయనతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు రతన్జీకి కడసారి నివాళులర్పించారు.
Union Home Minister Amit Shah tweets, “Have joined millions of Indians to grieve the sad demise of Ratan Tata Ji. Also laid a wreath on behalf of PM Narendra Modi. Ratan Tata Ji will always be remembered as a beacon of patriotism and integrity…” pic.twitter.com/J8zSTqlhPj
— ANI (@ANI) October 10, 2024
#WATCH | Mortal remains of Industrialist Ratan Tata being taken for last rites from NCPA lawns, in Mumbai
The last rites will be held at Worli crematorium. pic.twitter.com/Cs2xjeZBDi
— ANI (@ANI) October 10, 2024
Also Read..
Ratan Tata | ఆర్కిటెక్ట్ కావాలనుకున్నారు.. చివరికి టాటా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు