Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రతన్ టాటా మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ (Piyush Goyal).. రతన్ టాటాతో గడిపన క్షణాలను గుర్తు చేసుకుని (remembering Ratan Tata) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు.
‘రతన్ టాటాతో మేము గడిపిన క్షణాలు మరిచిపోలేను. ఆయనతో అల్పాహారం తీసుకున్న జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకువస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం ఆయన ఓ సారి ముంబైలోని మా ఇంటికి వచ్చారు. అప్పుడు అల్పాహారం సమయంలో ఆయన కేవలం సాధారణ ఇడ్లీ, దోస, వడ, సాంబార్‌ను మాత్రమే తీసుకున్నారు. అప్పుడు అర్థమైంది.. ఆయన సాధారణ జీవితంతోనే చాలా సంతోషంగా ఉంటారని. ఎంతో దయా హృదయం కలవారు. ఇంటి నుంచి వెళ్లిపోయే ఉందు నా భార్య మనసులోని భావాన్ని కూడా అర్థం చేసుకున్నారు. మీరు నాతో ఫొటో దిగాలని అనుకుంటున్నారా..? అని అడిగారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆయనతో ఒక చిత్రాన్ని కోరుకుంటారు. కొన్ని నిమిషాలైన ఆయనతో గడపాలని ఆశిస్తుంటారు. ఆయన్ని 140 కోట్ల మంది భారతీయులతో పాటు ప్రపంచమంతా ప్రేమిస్తుంది. ఆయనతో గడిపిన ప్రతీ క్షణం ఓ మధురమైన జ్ఞాపకం’ అంటూ పియూష్ గోయల్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.
#WATCH | Union Minister Piyush Goyal breaks down as he gets emotional when recalls his memory with Ratan Tata, he says, “…The small and thoughtful gestures which make the man the Ratan Tata – 140 crore Indian love and the world loves.”
Union Minister Piyush Goyal says, ” I… pic.twitter.com/zPAIS9S0ai
— ANI (@ANI) October 10, 2024
Also Read..
Ratan Tata | ఆర్కిటెక్ట్ కావాలనుకున్నారు.. చివరికి టాటా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు
Ratan Tata | గుడ్ బై మై డియర్ లైట్‌హౌస్.. రతన్ టాటా యువ ఆప్తుడు శంతను నాయుడు పోస్ట్
Ratan Tata | రతన్ టాటాకు ఆ కారు చాలా ప్రత్యేకం.. అదేంటంటే..?