Ratan Tata | రతన్ టాటా (Ratan Tata).. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తికాదు. దేశీయ కార్పొరేట్ దిగ్గజం టాటాసన్స్ సారధ్య బాధ్యతలు వారసత్వంగా చేపట్టి.. దాన్ని మరింత ఉన్న స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. అయితే, రతన్జీ కలలు కన్న ప్రపంచం ఇది కాదు. కుర్రాడిగా ఉన్నప్పుడు సాధారణ పిల్లల మాదిరిగానే ఆయన కూడా ఆర్కిటెక్ట్ (architect) కావాలని కలలు కన్నారు. కానీ విధి ఆయన్ని టాటా సన్స్ వ్యాపారంలోకి తీసుకెళ్లింది.
రతన్ టాటా తొలి నుంచి ఆర్కిటెక్ట్ కావాలని కల కన్నారు. కానీ ఆయన తండ్రి మరోలా ఆలోచించారు. రతన్‌ను ఇంజినీర్‌ను చేయాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగా ఇంజినీరింగ్ కాలేజీలో చేర్చారు. కానీ ఆర్కిటెక్చర్‌పై మక్కువతో ఇంజినీరింగ్ కోర్సును మధ్యలోనే వదిలేశారు రతన్ టాటా. 1959లో న్యూయార్క్ కొర్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సులో చేరారు. పట్టా అందుకున్నాక కొలువు కూడా చేశారు. లాస్ ఏంజిల్స్ కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా పని చేశారు. అయితే, విధి అనుకోకుండా టాటా సన్స్ వ్యాపారంలోకి తీసుకెళ్లింది.
తండ్రి బాధ్యతలు టేకోవర్ చేయాల్సి రావడంతో రతన్.. తనకిష్టమైన ఆర్కిటెక్ట్ వృత్తికి తిలోదకాలిచ్చారు. టాటా వ్యాపార రంగంలో ప్రవేశించడమే కాదు.. రికార్డులు నెలకొల్పారు. టాటా సన్స్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్లారు. అయితే, తనకు ఇష్టమైన ఆర్కిటెక్చర్ వృత్తిని వదిలి.. వ్యాపారంలోకి అడుగిడటం తనను ఎంతగానో బాధించిందని గతంలో ఓ సందర్భంలో రతన్ టాటా చెప్పారు. డిగ్రీ పొందినా వృత్తిలో కొనసాగకపోవడం బాధిస్తుంటుందన్నారు. ఆర్కిటెక్ట్నని చెప్పుకోవడానికి ఇబ్బంది పడకపోయినా.. దాంట్లోనే కొనసాగకపోవడం చింతించ దగ్గ విషయం అన్నారు.
తనకు ఇష్టమైన వృత్తిలో కొనసాగకపోయినప్పటికీ.. ఆ కోర్సు నేర్పిన పాఠాలు తన వ్యాపారాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపకరించాయన్నారు. నిర్దేశిత బడ్జెట్లోనే ప్రాజెక్ట్ పూర్తి చేయడంతోపాటు వ్యాపార నిర్వహణలో వచ్చే చిక్కులను ఎదుర్కొనే సామర్థ్యం ఆర్కిటెక్చర్ కోర్సులో నేర్చుకున్నానని చెప్పారు రతన్ టాటా.
Also Read..
Ratan Tata | గుడ్ బై మై డియర్ లైట్‌హౌస్.. రతన్ టాటా యువ ఆప్తుడు శంతను నాయుడు పోస్ట్
Ratan Tata | రతన్ టాటాకు ఆ కారు చాలా ప్రత్యేకం.. అదేంటంటే..?
Ratan Tata | వీడ్కోలు మిత్రమా.. రతన్ టాటా మృతి పట్ల మాజీ ప్రేయసి ఎమోషనల్ పోస్ట్