Ratan Tata | రతన్ టాటాకు ఆ కారు చాలా ప్రత్యేకం.. అదేంటంటే..?
Ratan Tata | టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కుటుంబం.
Ratan Tata | టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కుటుంబం. టాటా సంస్థ ఎన్నో రంగాలకు విస్తరించినా ఆ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది.. టాటా కార్లే. 1991లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా (Ratan Tata).. సంస్థను భారీగా విస్తరించారు. పేదవాడి కారైన టాటా నానోతోపాటు టాటా ఇండికా కార్లను మార్కెట్‌కు పరిచయం చేశారు. అంతేకాదు ఎన్నో మోడళ్లను తీసుకొచ్చిన ఘనత ఆ కంపెనీది.
అయితే, ఎన్నో ఖరీదైన కార్లు తన కంపెనీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. రతన్ టాటాకు మాత్రం టాటా మోటార్స్ రూపొందించిన ‘ఇండికా’ (Tata Indica) కారునే ఎక్కువ ఇష్టపడతారు. ఈ విషయాన్ని రతన్ టాటానే స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. ఇండికా కారుపై తనకున్న ప్రేమను చాటుతూ గతంలో (గతేడాది జనవరిలో) ఓ పోస్టు పెట్టారు. ఆ కారు పక్కన నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘25 సంవత్సరాల క్రితం, టాటా ఇండికాను ప్రారంభించడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది’ అంటూ రాసుకొచ్చారు.
టాటా మోటార్స్ సంస్థ 1998లో ఇండికాతో తన ప్యాసింజర్ కార్ల తయారీని ప్రారంభించింది. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాల్లోనే అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. క్యాబ్ సర్వీసులు ప్రారంభమైన తొలినాళ్లలో ఇండికా కారునే ఎక్కువగా ఉపయోగించేవారు. ఇండికాలో విస్టా, మాంజా అనే మోడల్స్‌ను విడుదల చేసినప్పటికీ, అవి అమ్మకాల్లో పెద్దగా రాణించలేకపోయాయి. దీంతో 2018లో టాటా మోటార్స్ ఇండికా తయారీని నిలిపివేసింది.
ఇక ప్రయాణికుల భద్రతకు టాటా అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. అంతేకాదు, అందరికీ అందుబాటు ధరలోనే కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇండియాలో మొట్టమొదటి 5/5 రేటింగ్ సాధించిన కారు టాటా నెక్సాన్.. దీని సృష్టికర్త రతన్ టాటానే కావడం విశేషం.
Also Read..
Ratan Tata | నా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. రతన్ టాటా చివరి పోస్ట్ ఇదే..
Ratan Tata | వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..
Ratan Tata | లెజెండ్స్‌కు మరణం ఉండదు.. రతన్ టాటాకు వ్యాపార దిగ్గజాల సంతాపం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

