Ratan Tata | వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. బీపీ లెవెల్స్ పడిపోవడంతో సోమవారం ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా మృతిపట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సైతం రతన్ టాటా మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానొక మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘రతన్ టాటా మరణం టాటా గ్రూప్‌కే కాదు దేశానికే తీరని లోటు. వ్యక్తిగతంగా ఆయన మరణం నాకు తీరని శోకాన్ని నింపింది. నేను ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను. ఆయనను కలిసిన ప్రతి సందర్భం నాలో స్ఫూర్తిని నింపేది’ అంటూ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
రతన్ టాటా ఇక లేరన్న నిజాన్ని అంగీకరించలేకపోతున్నానని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మకమైన స్థానంలో ఉండటానికి రతన్ టాటా దేశానికి అందించిన సేవలు కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఆయన మార్గదర్శకత్వం భవిష్యత్ తరానికి ఎంతో అమూల్యమైనదని తెలిపారు. ఆయన సంస్కరణలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ‘మిస్టర్ టి (Mister T)కి ఇక వీడ్కోలు. మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోను.. ఎందుకంటే లెజెండ్స్ కు ఎప్పటికీ చావు ఉండదు.. ఓం శాంతి’ అని మహీంద్రా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
I am unable to accept the absence of Ratan Tata.
India’s economy stands on the cusp of a historic leap forward.
And Ratan’s life and work have had much to do with our being in this position.Hence, his mentorship and guidance at this point in time would have been invaluable.… pic.twitter.com/ujJC2ehTTs
— anand mahindra (@anandmahindra) October 9, 2024
రతన్ టాటా (Ratan Tata) మరణం పట్ల గౌతమ్ అదానీ (Gautam Adani) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతదేశం ఓ దిగ్గజాన్ని కోల్పోయిందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. దేశ అభివృద్ధిపై రతన్ టాటా ప్రభావాన్ని చూపారని, ఒక దిగ్గజాన్ని కోల్పోయామన్నారు. ఆయన కేవలం వ్యాపార నాయకుడు మాత్రమే కాదని, సమగ్రత, కరుణ, తిరుగులేని నిబద్ధతతో దేశస్ఫూర్తిని మూర్తీ భవించారన్నారు. ఆయన లాంటి లెజెండ్స్‌కు మరణం ఉండదని.. ఎప్పటికీ మనతోనే ఉంటారని పేర్కొన్నారు.
India has lost a giant, a visionary who redefined modern India’s path. Ratan Tata wasn’t just a business leader – he embodied the spirit of India with integrity, compassion and an unwavering commitment to the greater good. Legends like him never fade away. Om Shanti 🙏 pic.twitter.com/mANuvwX8wV
— Gautam Adani (@gautam_adani) October 9, 2024
Also Read..
Ratan Tata | సాయంత్రం 4 గంటలకు రతన్ టాటా అంత్యక్రియలు..
Ratan Tata | దివికేగిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రముఖుల నివాళి