Ratan Tata | వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. బీపీ లెవెల్స్ పడిపోవడంతో సోమవారం ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా మృతిపట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన చివరి పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
మూడు రోజుల క్రితం ఆయన తన ఆరోగ్యం గురించి కీలక పోస్ట్ పెట్టారు. రతన్ టాటా అస్వస్థతకు గురైనట్లు వార్తలు రావడంతో.. తాను క్షేమంగానే ఉన్నానంటూ వివరణ ఇచ్చారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. తాను ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చానని, ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెంది.. పుకార్లు వ్యాప్తి చేయవద్దని సూచించారు. సరిగ్గా ఆయన పోస్టు చేసిన మూడు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. ‘నా ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిరాధారమైనవి. నా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు (Thank You For Thinking Of Me)’ అని రతన్ టాటా పేర్కొన్నారు. సరిగ్గా ఈ ట్వీట్ పెట్టిన మూడు రోజుల తర్వాత తుదిశ్వాస విడవడం కలచివేస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన చివరి పోస్ట్ పోస్టు ( Last Social Media Post) నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read..
Ratan Tata | వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..
Ratan Tata | లెజెండ్స్‌కు మరణం ఉండదు.. రతన్ టాటాకు వ్యాపార దిగ్గజాల సంతాపం
Ratan Tata | రతన్ టాటా లెజండరీ లైఫ్ ఇన్ ఫొటోస్