Ratan Tata | వీడ్కోలు మిత్రమా.. రతన్ టాటా మృతి పట్ల మాజీ ప్రేయసి ఎమోషనల్ పోస్ట్
Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ (Simi Grewal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రతన్ టాటా మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ (Simi Grewal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘మీరు ఇక లేరని అంటున్నారు. ఆ లోటు భరించడం చాలా కష్టం.. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు (heartbreaking note). ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. బాలీవుడ్ నటి అయిన సిమి గరెవాల్ గతంలో రతన్ టాటాతో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రతన్ టాటాతో సన్నిహితంగా మెలిగినట్లు తెలిపారు. ఆ తర్వాత విడిపోయామని, అప్పటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
They say you have gone ..
It’s too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024
రతన్ టాటా ఇప్పటికీ అవివాహితుడు. నాలుగు సార్లు పెళ్లి దాకా వచ్చారు కానీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాలేదు. లాస్ ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఒకమ్మాయితో ప్రేమలో పడ్డాను అని టాటా చెప్పారు. 1962 ఇండో – చైనా యుద్ధం కారణంగా ఆమె తల్లిదండ్రులు ఇండియాకు పంపించేందుకు అంగీకరించలేదు. అలా లవ్ మ్యారేజ్‌కు బ్రేక్ పడిందని తెలిపారు.
Also Read..
Ratan Tata | గుడ్ బై మై డియర్ లైట్‌హౌస్.. రతన్ టాటా యువ ఆప్తుడు శంతను నాయుడు పోస్ట్
Ratan Tata | వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..
Ratan Tata | నా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. రతన్ టాటా చివరి పోస్ట్ ఇదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

