Rohit Sharma : స్వదేశంలో బెబ్బులిలా గర్జించే భారత జట్టుకు ఘోర పరాభవం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2023-25) ఫైనల్ ఆశలకు గండికొడుతూ న్యూజిలాండ్ 3-0తో సిరీస్‌ను తన్నుకుపోయింది. స్వల్ప ఛేదనలో విజయం మనదే అనే ధీమాతో ఉన్న అభిమానులకు షాకిస్తూ.. రోహిత్ సేన 25 పరుగుల తేడాతో ఓడి డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానం చేజార్చుకుంది. సొంత మైదానం వాంఖడేలో దారుణ ఓటమిపై హిట్‌మ్యాన్ స్పందిస్తూ.. సిరీస్ కోల్పోవడం, టెస్టు మ్యాచ్ ఓడడం చాలా బాధగా ఉందని అన్నాడు.
వాంఖడేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ విఫలమైంది. రిషభ్ పంత్(64) ఒంటరి సైనికుడిలా పోరాడినా చివరిదాకా నిలిచి విజయాన్ని అందించలేకపోయాడు. అజాబ్ పటేల్(6/57) తిప్పేయగా న్యూజిలాండ్ చిరస్మరణీయ విజయంతో భారత జట్టును వైట్‌వాష్ చేసింది. ఊహించని పరాజయంపై రోహిత్ శర్మ (Rohit Sharma) ఏం అన్నాడంటే.. ‘స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోవడం జీర్ణించుకోలేని విషయం. మేము అత్యుత్తమ ఆట ఆడలేదు. సిరీస్ ఆసాంతం కివీస్ చాలా గొప్పగా ఆడింది. బెంగళూరు, పుణేలో మేము ఎక్కువ రన్స్ చేయలేదు. ఇప్పుడు వాంఖడేలోనూ 30 పరుగుల ఆధిక్యం సాధించామంతే.
Rohit Sharma said, “I fully take the responsibility of this series defeat. I wasn’t at my best as a batter and as a captain. It’s a low point in my career”. pic.twitter.com/vwX2GnqELz
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2024
ఇక 147 పరుగుల టార్గెట్ చిన్నదే. ఛేదించగలం అనుకున్నాం. కానీ, మా వల్ల కాలేదు. ఇలాంటి పిచ్ మీద ఎలా ఆడాలో యశస్వీ, గిల్, పంత్‌లు చూపించారు. ఈసిరీస్‌లో మేము కొన్ని ప్రయోగాలు చేశాం. అవి ఫలించలేదు. నా విషయానికొస్తే.. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలం అయ్యాను’ అని వెల్లడించాడు.
మూడు టెస్టుల సిరీస్‌లో రోహిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 52 మినహాయిస్తే పెద్దగా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి హిట్‌మ్యాన్ 94 రన్స్ కొట్టాడంతే. ఓపెనర్‌గా అతడు శుభారంభం ఇవ్వకపోవడంతో భారత జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి.
India drop down to second place on the WTC table after losing every single #INDvNZ Test 📉 pic.twitter.com/WPOMujEijo
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2024
ముంబైలోని వాంఖడేలో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన రోహిత్ స్వల్ప ఛేదనలో బాధ్యతగా ఆడాల్సిందిపోయి 11 పరుగులకే వికెట్ ఇచ్చేశాడు. వాంఖడేలో ఓటమితో డబ్ల్యూటీసీ రాంకింగ్స్‌లో టీమిండియా 58.33 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. శ్రీలంక 55.56 పాయింట్లతో మూడో, న్యూజిలాండ్ 54.55 పాయింట్లతో నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాయి.