హైదరాబాద్ : యాదవుల ఐక్యతకు సదర్(Sadar) వేడుక చిహ్నంగా నిలుస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. నారాయణగూడలో యాదవ సేవాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే తొలిపూజను నిర్వహించి సదర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70, 80 సంవత్సరాల నుంచి సదర్ణు యాదవులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సదర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పేరెన్నిక గల దున్నపోతులను తీసుకొచ్చి విన్యాసాలు నిర్వహించడం సదర్‌లో ప్రత్యేక ఆకర్షణ అన్నారు. వాటిని చూసేందుకు లక్షలాదిమంది ప్రజలు వస్తారని చెప్పారు.