అమరావతి : ఏపీలో చంద్రబాబు పాలన మొదలైన నాటి నుంచి అరాచకం మొదలైందని, మాఫియా పాలన (Mafia rule) కొనసాగుతుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. ఎక్కడ చూసిన అత్యాచారాలు, మానభంగాలు, వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వైసీపీ(YCP) అధ్యక్షుడిగా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.
కూటమి పాలనలో 5 నెలలకే 150 వరకే ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. రోజుకో అభూత కల్పనతో వైఎస్ జగన్ (YS Jagan) పై అభాండాలు వేస్తు దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో పేద ప్రజల పక్షాన వైఎస్ జగన్ నిలబడ్డారని, ఆ యజ్ఞంలో ఎక్కువగా ఇబ్బంది పడింది కార్యకర్తలేనని అంగీకరించారు. సంక్షేమం అంటే నాలుగు రూపాయలు ఇవ్వడం కాదని గ్రహించి ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. వైసీపీ పాలన ఆదర్శవంతమైన పాలన అని కొనియాడారు.
రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ 2027లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి కార్యకర్త ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని కోరారు. ఎన్నికల శంఖారావాన్ని ఇప్పుడే పూరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గత ఎన్నికల్లో కొన్ని వర్గాలు అసంతృప్తికి లోనయ్యారని అటువంటి వారిని పరిగణనలోకి తీసుకొని ప్రేమ, ఆప్యాయతను తిరిగి పొందడానికి , ఎన్నికల్లో విజయం సాధించడానికి కలిసికట్టుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, పేర్నినాని తదితరులు పాల్గొన్నారు.