IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొన్ని పోరాటాలు అభిమానుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తుంటాయి. ముంబై ఇండియన్స్(Mumbai Indians), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)ల మధ్య మ్యాచ్ కూడా అలాంటిదే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లోనూ ఈ రెండూ బలమైన జట్లే. ఇప్పటికే ముంబై ఐదుసార్లు ట్రోఫీని ముద్దాడగా.. కోల్‌కతా మూడు పర్యాయాలు విజేతగా నిలిచింది. అందుకే.. మాజీ చాంపియన్లు అయిన ఈ రెండు టీమ్‌ల మధ్య జరిగే హోరాహోరీ పోరును అస్వాదిస్తారు ప్రేక్షకులు.
18వ సీజన్ లీగ్ దశలో భాగంగా ఇరుజట్లు వాంఖడేలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారీ స్కోర్ కొట్టేది ఎవరు? అత్యధిక వికెట్లు తీసేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎడిషన్‌లో బోణీ కొట్టని ముంబై.. రెండో విజయంపై కన్నేసిన కోల్‌కతాకు చెక్ పెడుతుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
Rohit Sharma vs KKR
Innings -: 27
Runs -: 939
Average -: 47🔥
Strike Rate -: 133
50s -: 6
100 -: 1
Highest Score -: 109*
Not outs -: 7Unofficial Owner of KKR😭😂.#ipl2021 #mi pic.twitter.com/8Pz1yPdyli
— Pɾαყυ ⁴⁵ (@rohitianprayu45) April 11, 2021
గత సీజన్లలో ముంబై, కోల్‌కతా పర్యాయాలు ఎదురుపడ్డాయి. అత్యధిక స్కోర్ విషయానికొస్తే.. రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు. 2012లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో బౌండరీలతో చెలరేగిన హిట్‌మ్యాన్ సెంచరీతో గర్జించాడు. 60 బంతులాడిన అతడు109 నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటికీ ఇరుజట్ల పోరులో అత్యధిక పరుగుల వీరుడు అతడే కావడం విశేషం.
అయితే.. 16వ సీజన్లో కోల్‌కతా స్టార్ వెంకటేశ్ అయ్యర్ శతకంతో మెరిశాడు. వాంఖడే స్టేడియంలో ముంబై బౌలర్లను ఉతికారేసిన అతడు.. 51 బంతుల్లోనే 104 కొట్టి ఔటయ్యాడు. అదే ఈడెన్ గార్డెన్స్‌లో రోహిత్ 98 నాటౌట్‌గా నిలిచాడు. ముంబై సారథి హార్దిక్ పాండ్యా 91(34 బంతుల్లోనే) ఇన్నింగ్స్, హిట్‌మ్యాన్ 84 నాటౌట్ ఇన్నింగ్స్‌కు టాప్ -5లో చోటు దక్కింది. మరి.. 18వ సీజన్లో రోహిత్ 109 నాటౌట్ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారు? అనేది చూడాలి.