Kotagiri | కోటగిరి, మార్చి31 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోమవారం ఉదయమే ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కోటగిరి మండల ప్రజా ప్రతినిధులు మైనార్టీ సోదరులకు కలిసి రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.