చిక్కడపల్లి, మార్చి 31:ప్రజలు రేవంత్ రెడ్డి నమ్ముకుని అధికారం అప్పచెప్పితే ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నాడు అని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టిపిఎస్ కే) రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు. విద్యాలయాల సంస్థల భూములను అమ్ముకోవడం అంటే దేశ విద్యా వ్యవస్థను నాశనం చేయడం అవుతుందని విమర్శించారు.
యూనివర్సిటీల భూములు అమ్ముకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. రియల్ స్టేట్ నేపథ్యం కలిగిన రేవంత్ రెడ్డి ఆయన ఆలోచన విధానాలు కూడా ఆ విధంగానే ఉన్నాయని మండిపడ్డారు. భూములను సంరక్షించాల్సిన రాష్ట్ర సర్కారు అమ్మడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.