IPL 2025 : ఐపీఎల్లో ఆల్‌టైమ్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) బోణీ కోసం నిరీక్షిస్తుంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై.. తమ సొంత ఇలాకాలో విజయంతో టోర్నీలో ముందడుగు వేయాలనే కసితో ఉంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా సేన ఢిఫెండింగ్ ఛాంపియిన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో తలపడుతోంది. వాంఖడేలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్
పాండ్యా ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు.
తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడి.. రెండో పోరులో గెలుపొందిన కోల్‌కతా విక్టరీపై కన్నేసింది. దాంతో, ఇరుజట్ల మధ్య ఉత్కంఠ పోరు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. 17వ సీజన్ నుంచి ఈ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టును11 సార్లు విజయం వరించగా.. ఛేజింగ్ జట్టు కూడా 11 పర్యాయాలు లక్ష్యాన్ని అందుకుంది.
🚨 Toss 🚨@mipaltan elected to field against @KKRiders
Updates▶️ https://t.co/iEwchzEpDk#TATAIPL | #MIvKKR pic.twitter.com/VqHjlTKB7o
— IndianPremierLeague (@IPL) March 31, 2025
ముంబై తుది జట్టు : రియాన్ రికెల్టన్, విల్ జాక్స్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విగ్నేశ్ పుతూర్.
కోల్‌కతా తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.