KVN Productions | కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ప్రాజెక్టులపై పలు రూమర్లకు .. అధికారిక ప్రకటనతో క్లారిటీ
KVN Productions | ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన భవిష్యత్ ప్రాజెక్టులపై ఇటీవల సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఆ బ్యానర్ నుంచి రానున్న సినిమాలు ఆగిపోయాయా? ప్రాజెక్టులు నిలిచిపోయాయా? అనే సందేహాలు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
KVN Productions | ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన భవిష్యత్ ప్రాజెక్టులపై ఇటీవల సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఆ బ్యానర్ నుంచి రానున్న సినిమాలు ఆగిపోయాయా? ప్రాజెక్టులు నిలిచిపోయాయా? అనే సందేహాలు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. అయితే ఈ రూమర్లపై తాజాగా నిర్మాణ సంస్థ స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ టీమ్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పుకార్లను పూర్తిగా ఖండించింది. తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని అభిమానులకు, సినీ ప్రియులకు విజ్ఞప్తి చేసింది.
తమ నిర్మాణంలో ఉన్న అన్ని సినిమాలు ముందుగా ప్లాన్ చేసిన విధంగానే కొనసాగుతున్నాయని, ఎలాంటి సమస్యలు లేవని టీమ్ వెల్లడించింది. ప్రాజెక్టుల డెవలప్మెంట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇటీవల ఆ సంస్థ నిర్మిస్తున్న కొన్ని భారీ ప్రాజెక్టులపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ కారణంగా కొన్ని సినిమాలు నిలిచిపోయాయని, షూటింగ్ ఆలస్యం అవుతుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అభిమానులు కూడా ఆ విషయంపై ఆసక్తిగా చర్చించుకున్నారు. అయితే ఈ వార్తలన్నింటికీ తెరదించేందుకు కేవీఎన్ ప్రొడక్షన్స్ టీమ్ ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చింది. తమ నిర్మాణంలో ఉన్న ప్రతి సినిమా యథావిధిగా కొనసాగుతోందని మరోసారి స్పష్టం చేసింది.
ఇదే సమయంలో తమ సినిమాలకు సంబంధించిన అధికారిక అప్డేట్లను త్వరలో వరుసగా ప్రకటించనున్నట్లు కూడా సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో పవర్ఫుల్ ప్రాజెక్టుల లైనప్‌ను అభిమానుల ముందుకు తీసుకురానున్నామని వెల్లడించింది. గతంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ పలు భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. ప్రముఖ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేయనున్నట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించడంతో ఆ చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఇటీవల వచ్చిన రూమర్లు అభిమానుల్లో కొంత సందేహాన్ని కలిగించాయి. అయితే తాజాగా సంస్థ ఇచ్చిన క్లారిటీతో ఆ అనుమానాలకు చాలావరకు ముగింపు లభించినట్టైంది. ముఖ్యంగా త్వరలో పవర్ఫుల్ లైనప్‌ను ప్రకటిస్తామని చెప్పడంతో ఆ సంస్థ నుంచి వచ్చే తదుపరి ప్రకటనలపై ఆసక్తి మరింత పెరిగింది. ఏది ఏమైన కేవీఎన్ ప్రొడక్షన్స్ తమ భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. త్వరలో ఆ సంస్థ నుంచి వచ్చే కొత్త అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఆ ఉత్తర్వులు బీజేపీ కార్యకర్తలకు రోజ్‌గార్ గ్యారెంటీ’
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

