కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక మార్పు చోటుచేసుకున్నది. గత ఎన్నికల్లో 8 దశల్లో భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. అయితే ఈసారి కేవలం రెండు దశల్లోనే పోలింగ్ నిర్వహించనున్నారు. (West Bengal Assembly elections) పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. 2021లో పశ్చిమ బెంగాల్లో జరిగిన 8 దశల పోలింగ్ కంటే ఈసారి రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 23, 29 తేదీలలో పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు.
కాగా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో మార్చి చివరిలో ఓటింగ్ ప్రారంభమై ఏప్రిల్ 29 వరకు కొనసాగింది. సుమారు నెల రోజుల పాటు ఎనిమిది దశల్లో పోలింగ్ జరిగింది. అయితే ఈసారి పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగనున్నది. వివరణాత్మక చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఈ రాష్ట్రంలో పోలింగ్ దశల సంఖ్యను తగ్గించడం అవసరమని సీఈసీ భావించిందని చెప్పారు. రెండు దశల షెడ్యూల్‌ను ఖరారు చేయడానికి ముందు పోల్ ప్యానెల్ విస్తృతమైన చర్చలు నిర్వహించిందని అన్నారు. దీంతో రెండు దశల పోలింగ్ బెంగాల్ రాజకీయాలు, ఎన్నికల ప్రచారాలను ప్రభావం చేయనున్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు అస్సాం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనున్నది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 4న నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
Also Read:
Family Kills Daughter, Her Lover | ప్రేమించుకోవడంపై అభ్యంతరం.. జంటను హత్య చేసిన యువతి కుటుంబం
Teacher Beats Student Brutally | లెక్క తప్పుగా చేసినందుకు.. విద్యార్థినిని దారుణంగా కొట్టిన టీచర్
Watch: సీఎం హెలికాప్టర్ ల్యాండ్‌కు ముందు హెలిప్యాడ్‌లోకి ఆవు.. ఏం జరిగిందంటే?