Uppal Bus Stand | కాంగ్రెస్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే దృశ్యాలు ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తున్నాయనే విషయం తెలిసిందే. తాజాగా అలాంటి దృశ్యమే ఒకటి కెమెరా కంటికి చిక్కింది. ఉప్పల్ తాత్కాలిక బస్టాండ్ వద్ద రోడ్ల దుస్థితి ఎలా ఉందో ఈ దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి. ఉప్పల్ తాత్కాలిక బస్టాండ్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది.
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాత్కాలిక బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు బురదమయంగా మారింది. బస్‌స్టాండ్‌లో నిలిపిన ఓ సూపర్ లగ్జరీ బస్సు బురదలో కూరుకుపోయింది. బురదలో టైర్లు చొచ్చుకుపోవడంతో సదరు బస్సు డ్రైవరే స్వయంగా పార తీసుకుని మట్టిని తొలగించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం బస్‌స్టాండ్‌లో పరిస్థితి ఎలా ఉందో కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.
ఉప్పల్ తాత్కాలిక బస్టాండ్ వద్ద అధ్వానంగా రోడ్ల దుస్థితి
వర్షాలతో బురదమయంగా మారిన రోడ్డు
బురదలో కూరుకుపోయిన సూపర్ లగ్జరీ బస్సు pic.twitter.com/73MVx219LY
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026