కారేపల్లి, ఆగస్టు 04 : కారేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన చిలుముల రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రులయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ మంగళవారం వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందజేశారు. అంతకుముందు రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డొంకెన రవీందర్ గౌడ్, పాలిక వీర స్వామి, పేర్ని వెంకటేశ్వర్లు, చింతల సంపత్, ఎండి.ఖలీలుల్లా ఖాన్, సోమందుల వెంకటేశ్వర్లు, షేక్ అజారుద్దీన్ పాల్గొన్నారు.