సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కంటోన్మెంట్ ఆయుధాల చోరీ కేసు మిస్టరీ వీడడంతో అక్కడున్న రోడ్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రోడ్లను తిరిగి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. ఈ నెల 1వ తేదీన కంటోన్మెంట్లోని మద్రాస్ రెజిమెంట్ నుంచి ఆయుధాలు చోరీ అయ్యాయనే విషయం వెలుగులోకి రావడంతో కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను మూసేశారు.
దీంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 16 రోడ్లలో 8 రోడ్లు మూతపడటంతో సాధారణ ప్రజలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఆయుధాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం, పోయిన ఆయుధాలను రికవరీ చేయడంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.