Sheikh Hasina | హసీనా ప్రెస్‌మీట్‌తో మా ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు.. భారత విదేశాంగ శాఖ
Sheikh Hasina | దేశ రాజధానిలో బుధవారం జరగనున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheik Hassina) వర్చువల్ మీడియా సమావేశం (Press Meet) తో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. ఇది పూర్తిగా ఒక 'ప్రైవేట్ మీడియా సంస్థ' నిర్వహిస్తున్న కార్యక్రమమని, అక్కడ వ్యక్తమయ్యే ఏ అభిప్రాయాలనూ భారత్ సమర్థించదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randheer Jaiswal) తెలిపారు.
Sheikh Hasina : దేశ రాజధానిలో బుధవారం జరగనున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheik Hassina) వర్చువల్ మీడియా సమావేశం (Press Meet) తో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. ఇది పూర్తిగా ఒక ‘ప్రైవేట్ మీడియా సంస్థ’ నిర్వహిస్తున్న కార్యక్రమమని, అక్కడ వ్యక్తమయ్యే ఏ అభిప్రాయాలనూ భారత్ సమర్థించదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randheer Jaiswal) తెలిపారు.
ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ (FCC) ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంపై బంగ్లాదేశ్ తన ఆందోళనలను భారత్‌కు తెలిపింది. గత ఏడాది నుంచి భారత్‌లో ఉంటున్న షేక్ హసీనా ప్రసంగం ద్వారా ఇటీవలి ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని బంగ్లాదేశ్ భావిస్తోంది. సోమవారం బంగ్లాదేశ్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు హుమాయూన్ కబీర్, బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్ దినేష్ త్రివేదిల మధ్య జరిగిన భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
ఇదే సందర్భంలో బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్‌కు ఫిబ్రవరి 2026లో అధికారిక ద్వైపాక్షిక పర్యటన కోసం ఆహ్వానం అందించినట్లు జైస్వాల్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుత బిమ్స్టెక్ (BIMSTEC) చైర్మన్ హోదాలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు అవుట్‌రీచ్ సెషన్‌కు హాజరుకావాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు తెలిపారు. 2027లో బిమ్స్టెక్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఢాకాలో బిమ్స్టెక్ సదస్సుకు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో ఈ ఆహ్వానానికి ప్రాధాన్యం ఏర్పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

