Nama Nageswara Rao | బీఆర్ఎస్ శ్రేణుల మధ్య మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు
Nama Nageswara Rao | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద పార్టీ శ్రేణులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ మాజీ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను జరిపారు.
Nama Nageswara Rao | జూలూరుపాడు, మార్చ్ 15 : ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ మాజీ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద పార్టీ శ్రేణులు ఈ వేడుకలను జరిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు యల్లంకి సత్యనారాయణ, జూలూరుపాడు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చాపలమడుగు రామ్మూర్తి కేక్ కట్ చేసి అక్కడున్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. నామా నాగేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ప్రజాసేవలో ఆయన మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, నియోజకవర్గానికి చేసిన సేవలను నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుద్దుకూరి నాగేశ్వరరావు, దుద్దుకూరి కృష్ణ ప్రసాద్, రాయపాటి వెంకటేశ్వర్లు, తాళ్లూరి రామారావు, తాళ్లూరి నవీన్, పురస్తపురవు రామకృష్ణ, ఇల్లంగి తిరుపతి, ఇసం రవి, మోదుగు నరసింహారావు యువకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also :
Vijay Sethupathi | విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మహారాజ 2 ఆన్ ది వే..!
Hebah Patel | కొత్త సినిమాకు హెబ్బా పటేల్ గ్రీన్ సిగ్నల్.. ఇంతకీ జోనర్ ఏంటో తెలుసా..?
Anil Kapoor | ఆదిత్య ధర్ ఆఫర్‌కు నో చెప్పడం నాకే నష్టం.. ధురంధర్-2పై అనిల్ కపూర్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

