IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రోజు రోజుకు ఉత్కంఠ పోరాటాలు మునివేళ్లపై నిలబెడుతున్నాయి. అరంగేట్రం చేసిన కుర్రాళ్లు తమ అద్భుత ప్రదర్శనలతో అభిమానులను అలరిస్తున్నారు. అటు ఛీర్‌లీడర్స్ డ్యాన్స్‌తో తమ టీమ్‌ను, స్టేడియంలోని ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నారు. అయితే.. అందరికంటే ఎక్కువగా ఓ రొబోటిక్ డాగ్(Robotic Dog) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని పేరు.. రొబో పప్(Robo Pup). తన నైపుణ్యాలతో అందర్ని అబ్బురపరిచే ఈ మర శునకం మైదానంలో క్రికెటర్లతో చేసే హడావిడి అంతాఇంతా కాదండోయ్. నెట్స్ ప్రాక్టీస్ సమయంలో, మ్యాచ్ ముగిశాక ఆటగాళ్లంతా ఈ ఎలక్ట్రిక్ డాగ్‌తో సరదాగా గడుపుతూ సేదతీరుతున్నారు.
ఈసారి ఐపీఎల్ ఎడిషన్‌లో నిర్వాహకులు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. టాస్‌ను మోసుకొచ్చే బుల్లి ఎలక్రికట్ కారు నుంచి.. రొబొటిక్ డాగ్ వరకూ అభిమానులు ఆకట్టుకునే ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్13న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్ డానీ మోరిస్ దీన్ని అందరికీ పరిచయం చేశాడు.
ఇంతకూ ఈ రోబోటిక్ డాగ్ ఎలా పనిచేస్తుందో తెలుసా.? సెన్సర్లు, కృత్రిమ మేధస్సు (AI) సాయంతో. దీనిలో అమర్చిన GoPro యాక్షన్ కెమెరాతో చకచకా మైదానం నలువైపులా దృశ్యాలను ఫొటోలు తీస్తుందీ శునకం. పనిలో పనిగా క్రికెటర్లకు ఎలాంటి ఆపద తలెత్తకుండా మైదానంలో గస్తీ కాస్తుంది.
అంతేకాదు క్రికెటర్ల ఫొటోలు తీస్తుంది. వాళ్లకు ఓ స్నేహితుడిలా షేక్ హ్యాండ్ ఇస్తుంది. వాళ్లు చెప్పిన విషయాల్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇస్తుంది. అంతేకాదు శరీరాన్ని వంచుతూ రకరకాల విన్యాసాలు కూడా చేస్తుంది. వేగంగా నడవడం.. పరుగెత్తడంతో పాటు జంప్ కూడా చేయగలదు ఈ శునకం. అందుకే.. ఆటగాళ్లు ఈ రొబోటిక్ డాగ్‌తో ఆటలాడుతూ చిల్ అవతున్నారు. ఒత్తిడిని దూరం చేసుకొని.. మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
Dhoni + Robo Dog Cam = Pure Entertainment.
Calm as ever, but the mischief is unmatched man’s having more fun than the camera.
Dhoni off the field is a walking sitcom calm face, killer wit.
#CaptainCool #MSD #CSK #OffFieldVibes— iceman❄️❄️ (@TheIceMaster07) April 15, 2025
లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) సైతం ఈ డాగ్‌ను ముద్దు చేశాడు. ఆటవిడుపుగా దీంతో కాసేపు కాలాక్షేపం చేసిన మహ కాసేపయ్యాక దాన్ని ఓ చిన్న సూట్‌కేసు మాదిరిగా పట్టుకొని తనవెంట తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.