Devarakadra | దేవరకద్ర : రైలులో నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన దేవరకద్ర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మహబూబ్నగర్ రైల్వే ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన సురేందర్ కుమారుడు భరత్ కుమార్(28) మంగళవారం హైదరాబాద్కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయల్దేరాడు. శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ వెళ్లేందుకు రైలు ఎక్కి డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. ప్రమాదవశాత్తు దేవరకద్ర సమీపంలో రైలు నుంచి కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై రాజు తెలిపారు.