Rishabh Pant : బెంగళూరులో ఊహించని ఓటమి. సిరీస్ సమం చేయాలంటే గెలవకతప్పని మ్యాచ్. అందుకని స్పిన్ పిచ్‌తో న్యూజిలాండ్ దెబ్బకొట్టాలనుకున్న టీమిండియా (Team India) వ్యూహం ఫలించింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (7/59) ఐదు వికెట్ ప్రదర్శనతో అదరగొట్టగా.. పుణే టెస్టు తొలి రోజే న్యూజిలాండ్ ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. రెండో రోజు భారత బ్యాటర్లు చెలరేగితే కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. అయితే.. తొలి రోజు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆసక్తికకర సంఘటన జరిగింది.
అశ్విన్, సుందర్‌ల విజృంభణతో ఒకదశలో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. సుందర్ బౌలింగ్‌లో సౌథీ బౌల్డ్ కాగానే 9వ బ్యాటర్‌గా అజాజ్ పటేల్(0) క్రీజులోకి వచ్చాడు. అప్పుడు వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఏం చేశాడంటే.. అజాజ్‌కు హిందీ రాదనుకొని సుందర్ తోడా ఆగే డాల్ సక్తేనా.. తోడా బాహర్ డాల్ సక్తే హై (కొంచెం బంతిని ముందుకు వేయ్.. లేదంటే బయటకు వేయ్) అని చెప్పాడు.
In today’s episode of 𝘒𝘦𝘦𝘱𝘪𝘯𝘨 𝘸𝘪𝘵𝘩 𝘙𝘪𝘴𝘩𝘢𝘣𝘩 𝘗𝘢𝘯𝘵! 👀😂#INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #TeamIndia pic.twitter.com/LoUC31wADr
— JioCinema (@JioCinema) October 24, 2024
అయితే.. పంత్, సుందర్‌లకు షాకిస్తూ అజాజ్ ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆ బంతిని బౌండరీకి పంపాడు. దాంతో, ఆశ్చర్యపోయిన పంత్.. ‘అరే నాకేమీ తెలుసు అతడికి హిందీ వస్తుందని’ అంటూ నవ్వేశాడు. అయితే.. ఆ తర్వాతి ఓవర్లోనే అజాజ్‌ను సుందర్ బౌల్డ్ చేశాడు. అజాజ్ వికెట్ గురించి పంత్.. సుందర్‌ల సంభాషణ అంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. జియో సినిమా ఈ వీడియోను ఎక్స్‌లో పెట్టింది. ఇంకేముంది.. ఆ వీడియో చూసినవాళ్లంతా ‘పంత్ నీ తప్పేమీ లేదులే’.. ‘అందరికీ హిందీ రాదనుకోకు’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
A 𝘴𝘶𝘯𝘥𝘢𝘳 spell from Washington, who finishes with his best-ever Test figures ✨
New Zealand have been bowled out for 259 runs in Pune 👉 https://t.co/3D1D83IgS1 #INDvNZ pic.twitter.com/g6lQfY98b9
— ESPNcricinfo (@ESPNcricinfo) October 24, 2024
ఇక్కడ విషయం ఏంటంటే.. భారత మూలాలు కలిగిన అజాజ్‌కు హిందీ కూడా అర్థం అవుతుంది. అజాజ్ తల్లిదండ్రులది ముంబై. అతడు అక్కడే జన్మించాడు. అజాజ్‌కు 8 ఏండ్ల వయసులో వాళ్ల కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. అక్కడికి వెళ్లాక క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్న అజాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా మారాడు. దేశవాళీలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికైన అజాజ్.. భారత్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.