ఖమ్మం : కాంగ్రెస్ పాలనలో ఆరాచకం పెరిగిపోతున్నది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం రౌడీయిజంతో పాలన సాగిస్తున్నది. తప్పుడు కేసులు బనాయిస్తూ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై భౌతికదాడులకు పాల్పడుతూ, కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) ఇలాకాలో బీఆర్ఎస్ నాయకులపై(BRS leaders) పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ఖమ్మం(Khammam) జిల్లా చింతకాని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అక్రమంగా అరెస్ట్(Illegally arrests) చేశారు.
ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ కుటుంబసభ్యులు, స్థానికులు పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులకు, స్థానికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, విషయం తెలుసుకున్న మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంకా ఎన్ని స్టేషన్ల చుట్టూ తిప్పుతూ.. భయబ్రాంతులకు గురిచేస్తారు అంటూ పోలీసులను ప్రశ్నించారు. మమల్ని చంపండి అంటూ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి ఇలాకాలో బీఆర్ఎస్ నాయకుల పై పోలీసులు దాష్టీకం
ఖమ్మం – చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను అక్రమ అరెస్ట్ చేసిన పోలీసులు
ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా అక్రమ అరెస్ట్.. సివిల్ డ్రెస్లో వచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు.
ఎందుకు అరెస్ట్… pic.twitter.com/MVAVempYHL
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2024
పెంట్యాల పుల్లయ్య అక్రమ అరెస్ట్ పై పోలీసులను నిలదీసిన బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు
మమల్ని చంపండి అంటూ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించిన మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
ఇంకా ఎన్ని స్టేషన్ల చుట్టూ తిప్పుతూ.. భయబ్రాంతులకు గురిచేస్తారు అంటూ పోలీసులను ప్రశ్నించిన… https://t.co/lYL1A0DZ4U pic.twitter.com/MMWqYn253M
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2024