ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 00:42:16

పతకాలు వెనక్కి ఇవ్వండి: డబ్ల్యూఎఫ్‌ఐ

పతకాలు వెనక్కి ఇవ్వండి: డబ్ల్యూఎఫ్‌ఐ

న్యూఢిల్లీ: డోపింగ్‌ పరీక్షలో దొరికిన వారు పతకాలు తిరిగి వెనక్కి ఇవ్వాలని జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) ఆదేశించింది. కేంద్ర క్రీడా శాఖ సూచనలకు అనుగుణంగా డోపింగ్‌కు పాల్పడిన వారి నుంచి పతకాలతో పాటు సర్టిఫికేట్లు తీసుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ సిద్ధమైంది. గత నాలుగు ఖేలో ఇండియా గేమ్స్‌లో పతకాలు సాధించిన 12 మంది రెజ్లర్లు డోపింగ్‌ పరీక్షలో విఫలమయ్యారు. ఇందులో రోహిత్‌ దహియా, మనోజ్‌, కపిల్‌, అభిమన్యు, వికాస్‌ కుమార్‌, విశాల్‌, జగదీశ్‌, రోహిత్‌, విరాజ్‌, వివేక్‌, జస్‌దీప్‌ సింగ్‌, రాహుల్‌ కుమార్‌ ఉన్నారు. వీరి పేర్లను సూచిస్తూ ఆయా రాష్ట్ర సంఘాలను ఇందులో భాగం కావాల్సిందిగా డబ్ల్యూఎఫ్‌ఐ కార్యదర్శి వినోద్‌ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.    


logo