Ravindra Jadeja : భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరోసారి తన సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సూపర్ హాఫ్ సెంచరీ బాదిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును పరోక్షంగా దెబ్బతీశాడు. వంద సెకన్లలోనే ఓవర్ పూర్తి చేసి టీమిండియాకు బిగ్ వికెట్ వచ్చేలా చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో కొరకుడుపడని కొయ్యలా మారిన బెన్ స్టోక్స్ వికెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు జడ్డూ.
లంచ్‌కు ముందు ఆఖరి ఓవర్ అనగా.. జడేజా కేవలం 100 సెకన్లలోనే ఆరు బంతులేశాడు. దాంతో..గిల్ సేనకు మరో ఓవర్ వేసే అవకాశం లభించింది. అప్పుడు నితీశ్ కుమార్‌కు బంతి ఇచ్చిన గిల్ స్పిన్నర్‌కు మనసు మార్చుకొని.. సుందర్‌ను పిలిచాడు. రెండో బంతికే వికెట్ కీపర్ క్యాచ్ అప్పీల్ నుంచి బతికిపోయిన స్టోక్స్.. మూడో బంతికి అడ్డంగా వికెట్ల ముందు దొరికిపోయాడు.
Just Sir Ravindra Jadeja things 🙇🏻♂️🙇🏻♂️
Because of jadeja finish over in under 100 second washington sundar gets a wicket of ben stokes.#Jadeja #jaddu #Washington #pant #Gill #ShubmanGill #INDvsENG #INDvsENGTest pic.twitter.com/d4nfaJkqh9— Cute bacha😇 (@cute_bacha_97) July 6, 2025
డిఫెన్స్ ఆడాలనుకున్న అతడు ఎల్బీగా ఔట్ కావడంతో ఆరో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్టోక్స్ వికెట్‌తో భారత్ విజయానికి మరింత చేరువైంది. లంచ్ తర్వాత జేమీ స్మిత్.. టెయిలెండర్లను చుట్టేస్తే ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా పరాజయాల ప్రస్థానానికి ఎండ్ కార్డ్ పడనుంది.
Thanks to Ravindra Jadeja 🇮🇳
Bowled his over in just 2 minutes ⚡
Gave India an extra over before Lunch
Sundar removed Ben Stokes in that bonus over 💥
Small moments. Big impact.
That’s Test cricket. That’s Team India 💪#INDvsENGTest #Jadeja pic.twitter.com/nYE3ALpGXz— THE NEW INDIA (@THENEWINDIA23) July 6, 2025