IND vs ENG : బర్మింగ్హమ్లో భారత జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతోంది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పేలా లేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే ఓలీ పోప్(24)ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్ (4-58) వికెట్ల వేటకు తెరతీశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఊహకందని బంతితో హ్యారీ బ్రూక్(23)ను ఎల్బీగా వెనక్కి పంపి టీమిండియాను గెలుపు వాకిట నిలిపాడు.
అయితే.. కెప్టెన్ బెన్ స్టోక్స్(35), జేమీ స్మిత్ (32 నాటౌట్)లు డిఫెన్స్ ఆడుతూ విసిగించారు. ఈ జోడీని విడదీసేందుకు గిల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరకు వాషింగ్టన్ సుందర్ బ్రేకిచ్చాడు. లంచ్‌కు ముందు ఓవర్లో స్టోక్స్ ఎల్బీగా ఔటయ్యాడు. అంతే.. భారత శిబిరంలో సంబురాలు మిన్నంటాయి. భోజన విరామం తర్వాత టెయిలెండర్లను చుట్టేస్తే గిల్ సేన చరిత్ర సృష్టించడం ఖాయం.
WASHINGTON SUNDAR GETS BEN STOKES IN THE FINAL OVER BEFORE LUNCH! 😲 pic.twitter.com/QDprrjxT2J
— Sky Sports Cricket (@SkyCricket) July 6, 2025
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు చరిత్ర లిఖించేందుకు సమీపించగా.. ఆతిథ్య జట్టుకు ఘోరపరాభవం ఎదురవ్వనుంది. వర్షం కారణంగా సుమారు గంటన్నర ఆలస్యంగా ఐదో రోజు ఆట మొదలైంది. నాలుగో రోజు రెండు వికెట్లు తీసి జోరుమీదున్న ఆకాశ్ దీప్ (4-58) కొత్త బంతితో మళ్లీ నిప్పులు చెరిగిన వేళ ఇంగ్లండ్ మిడిలార్డర్ కుప్పకూలింది. క్రీజులో పాతుకుపోవాలనుకున్న ఓలీ పోప్(24)ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఆకాశ్.. ఆతర్వాత ఆ తర్వాతి ఓవర్లో హ్యారీ బ్రూక్(32)ను ఎల్బీగా వెనక్కి పంపి భారత్‌ను విజయానికి మరింత చేరువ చేశాడు. ఈ స్పీడ్‌స్టర్ విజృంభణతో 83కే సగం వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్‌ను కెప్టెన్ బెన్ స్టోక్స్(32), జేమీ స్మిత్(33 నాటౌట్)లు ఆదుకున్నారు.
That’s Lunch on Day 5 of the 2nd #ENGvIND Test!
3⃣ wickets for #TeamIndia in the first session! 👏 👏
We shall be back for the second session shortly!
Updates ▶️ https://t.co/Oxhg97fwM7 pic.twitter.com/kgpndTYWwk
— BCCI (@BCCI) July 6, 2025
ఆకాశ్ పలుమార్లు వికెట్ తీసేలా కనిపించగా.. స్మిత్ అతికష్టమ్మీద వికెట్ కాపాడుకున్నాడు. కాస్త కుదురుకున్నాక ఇద్దరు బౌండరీలతో 50 ప్లస్ భాగస్వామ్యంతో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే.. స్పిన్నర్లును రంగంలోకి దింపిన గిల్ ఫలితం రాబట్టాడు. లంచ్‌కు ముందు వాషింగ్టన్ సుందర్ వేసిన ఓవర్లో స్టోక్స్ డిఫెన్స్ ఆడబోయి ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో, 153 వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. ఇక మిగిలింది టెయిలెండర్లు మాత్రమే. వీళ్లను భారత బౌలర్లు చుట్టేశారంటే ఎడ్జ్‌బాస్టన్‌లో చిరస్మరణీయ విజయం సొంతమైనట్టే.