Huzurabad | హుజురాబాద్ టౌన్, జూలై 6: పట్టణంలోని యాదవ నగర్ నుండి యాదవ సంఘం అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సిర్సపల్లి ఎక్స్ రోడ్డులో గల బీరన్న దేవాలయం కు భారీ ఎత్తున మహిళలు బోనాలతో ర్యాలీగా బయలుదేరి బీరన్నకు బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా బీరన్నకు మొక్కులు చెల్లించారు. సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి భాషబోయిన చిన్న రవి, కార్యవర్గ సభ్యులు సింగరేణి రవి, గండ్రకోట సారయ్య, గాదం స్వరూప, మక్కపల్లి కుమార్ స్వామి, భాషబోయిన చిన్న శ్రీనివాస్, భాషబోయిన రవి, ఓదెలు, రవి, మొండయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.