హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ దేశానికే ఆదర్శమని రాజ్యసభలో డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలనుకుంటున్న అభివృద్ధి నమూనాను తెలంగాణలో కేసీఆర్ పదేండ్ల క్రితమే చేసి చూపించారని వివరించారు. మంగళవారం రాజ్యసభలో గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం ‘హర్ ఘర్ జల్’ ఆలోచన చేయకముందే తెలంగాణలో కేసీఆర్ ‘మిషన్ భగీరథ’ తెచ్చారని చెప్పారు. రూ.43 వేల కోట్లతో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన నీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించారని గుర్తుచేశారు. రైతుబంధు, రైతు బీమాతో రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌ది అని వివరించారు. ‘లక్షాధికారి దీదీ’ అని కేంద్రం చెప్తుండగా గతంలోనే కేసీఆర్ తెలంగాణలో మహిళా శక్తి పేరిట సంఘాలకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని గుర్తుచేశారు.
ఉపాధి బకాయిలు ఇవ్వాలి
వీబీ జీ రామ్ జీ పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడాన్ని స్వాగతిస్తున్నామని వద్దిరాజు పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ఈ పథకానికి కేంద్రం 90%, రాష్ర్టాలు 10% నిధులు ఖర్చు చేస్తే బాగుంటుందని సూచించారు. దీన్ని ప్రస్తుతం 60:40 తగ్గించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. నిధుల వాటా మార్పుల సాకుతో కూలీల కు వేతనాలు ఆగకూడదని సూచించారు. పనిచేసిన 15 రోజుల్లోగా డబ్బులు నేరుగా ఖాతాల్లో పడేలా కేంద్రం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లను గ్రామాలకే పరిమితం చేయకుం డా, రైతులు పంటలు అమ్ముకోవడానికి వీలుగా మార్కెట్ యార్డుల వరకు అనుసంధానం చేయాలని, తెలంగాణకు ఉపా ధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిధుల వాటా మార్పు ల సాకుతో పేద కూలీల వేతనాలు ఆగకూడదని సూచించారు. దిశ కమిటీలకు మరి న్ని అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. భూ రికార్డుల డిజిటలైజేషన్ చేస్తున్నప్పుడు గ్రామీణ యువతకు సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని వివరించారు.