అచ్చంపేట రూరల్ : ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీINTUC) , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను ( General strike ) విజయవంతం చేయాలని ఏఐటీయూసీ(AITUC) జిల్లా అధ్యక్షులు మల్లేష్ కోరారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, కార్మికుల హక్కులను కాపాడాలని, కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, సంఘటిత , అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఐ డివిజన్ కార్యదర్శి పెరుమల గోపాల్, ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్, మహిళా సంఘం తాలూకా నాయకురాలు శివలీల, స్వాతి, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జరుపుల శివప్రచండ, రవి పాల్గొన్నారు.