Ravi Shastri : చెపాక్ టెస్టులో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔటైన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆత్మవిశ్వాసంగా కనిపించాడు. అంతలోనే ఆఫ్ స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ (Mehidy Hasan Miraj)కు ఎల్బీగా దొరికిపోయాడు. అయితే.. రిప్లేలో నాటౌట్ అని తెలిసింది. ఒకవేళ కోహ్లీ డీఆర్ఎస్కు వెళ్లి ఉంటే భారీ ఇన్నింగ్స్ ఆడేవాడేమో. అయినా.. గత కొన్నాళ్లుగా ఈ రన్ మెషిన్ ఆఫ్ స్పిన్నర్లకు వికెట్ సమర్పిస్తూ వస్తున్నాడు.
ఇప్పటికీ ఇది 39వ సారి. ఈ నేపథ్యంలో అతడికి మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) విలువైన సలహా ఇచ్చాడు. ‘ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు భయపడకు. స్వీప్ షాట్ల ద్వారా వాళ్ల లయను దెబ్బ తీయు’ అని విరాట్‌కు సూచించాడు. ‘గత రెండు మూడు ఏండ్లలో కోహ్లీ ఆఫ్ స్పిన్నర్లకు దొరికిపోతున్నాడు. అదే సమయంలో వాళ్ల బౌలింగ్‌లో పరుగులు కూడా సాధించాడు. అయితే.. వాళ్లకు వికెట్ ఇవ్వకూడదంటే విరాట్ తన కాళ్ల పొజిషన్ మార్చుకోవాలి.
బంతిని గమనించి స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాలి. ఇలా చేస్తే ఆఫ్ స్పిన్నర్లను ఆడడం తేలిక. అందుని కోహ్లీ భయపడకు. ఫీల్డింగ్ సెటప్ చేసినా సరే స్పిన్నర్ల తలపై నుంచి ఆడేందుకు సందేహించకు’ అని శాస్త్రి అభిప్రాయ పడ్డాడు. గత మూడేండ్లలో కోహ్లీ తరచుగా ఆఫ్ స్పిన్నర్లు నాథన్ లియాన్, మోయిన్ అలీ, గ్రేమ్ స్వాన్ల బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక లెగ్ స్పిన్నర్లు అయిన ఆదిల్ రషీద్, ఆడం జంపాలు అతడిని ఏకంగా 17 సార్లు వెనక్కి పంపారు.
Kohli was not out 💔 pic.twitter.com/AErzqp5418
— Crictips (@CrictipsIndia) September 20, 2024
ప్రపంచ క్రికెట్లో గొప్ప ఆటగాడైన కోహ్లీ టెస్టుల్లో 29వ సెంచరీ దగ్గరే ఆగిపోయాడు. ఫ్యాబ్ – 4లోని జో రూట్(Joe Root) 34వ సెంచరీతో టాప్‌లో ఉండగా.. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లు కోహ్లీ కంటే ముందున్నారు. అందుకని టెస్టుల్లో విరాట్ శతకం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెపాక్ టెస్టులో భారీ స్కోర్ చేసే అవకాశం పోగొట్టుకున్న అతడు.. రెండో టెస్టులో అయినా వంద కొడతాడని, కొట్టాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు.