Telangana | ఐటీఐలో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి.. ముఖ్యమంత్రి ఆదేశాలు
Telangana | మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు ఓ కమిటీని నియమించి, నిపుణులు, విద్యావేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు.
Telangana | మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు ఓ కమిటీని నియమించి, నిపుణులు, విద్యావేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చుతున్న నేపథ్యంలో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతి ఐటీఐ కళాశాలలకు ప్రిన్సిపాళ్లు ఉండేలా చూడాలని, శిక్షణ తీసుకుంటున్న వారికి సమగ్రమైన శిక్షణ అందేలా జాగ్రత్త పడాలని సూచించారు. ఐటీఐ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీలు క్రమం తప్పకుండా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఐటీఐ/ ఏటీసీ లేని శాసనసభ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరం మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధివిధానాలు రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

