Simhachalam prasadam | తిరుమల లడ్డూ ఎఫెక్ట్.. టెస్టింగ్‌కు సింహాచలం ప్రసాదం
Simhachalam prasadam | తిరుమలలో స్వామివారికి సమర్పించే నైవేద్యం, లడ్డూ తయారి లో కల్తీ నెయ్యిని వాడారని వచ్చిన వార్తలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి : తిరుమలలో స్వామివారికి సమర్పించే నైవేద్యం, లడ్డూ తయారి (Tirumala laddu ) లో కల్తీ నెయ్యిని వాడారని వచ్చిన వార్తలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో మరో ప్రసిద్ధ ఆలయమైన సింహాచలానికి (Simhachalam prasadam) తిరుమల ఎఫెక్ట్ తగిలింది . ఆలయంలో తయారు చేసే లడ్డూలతో పాటు ఇతర ఆహార తయారికి వాడుతున్న పదార్థాలను టెస్టింగ్ (Testing) కు పంపించనున్నారు.
ఈ సందర్భంగా భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు(MLA Ganta Srinivasrao) శనివారం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహా ఆలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ ఆలయంలో లడ్డూల తయారిపై ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణంతో సమానంగా భావించే తిరుమల క్షేత్రంలో లడ్డూ కల్తీ ఘోరమైన విషయం వైఎస్ జగన్ ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు.
వ్యవస్థలన్నింటీని సర్వనాశనం చేసిన ఆయన తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. మంచి నెయ్యి రూ.600 -వెయ్యి రూపాయలకు లభిస్తుండగా నాణ్యత లేని కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి భక్తుల మనోభావాలను మంటగలిపారని పేర్కొన్నారు. ఘటన తరువాత వైఎస్ జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపో నున్నారని వెల్లడించారు. డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం లేదని తెలిపారు. సింహాచలం ఆలయంలో తయారు చేసే పదార్థాలను సైతం అధికారులతో టెస్టింగ్‌కు పంపించనున్నామని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

