IPL 2025 : ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో చేతికందిన మ్యాచుల్లో ఓడిపోతున్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు పెద్ద షాక్. గాయంతో బాధ పడుతున్న కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) మరో మ్యాచ్‌కూ దూరం కానున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే కీలక పోరులో సంజూ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. అదే జరిగితే.. రాజస్థాన్ టాపార్డర్‌లో బలం తగ్గినట్టే. ఆర్సీబీతో మ్యాచ్‌కు శాంసన్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్ఆర్ ఫ్రాంచైజీ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘కెప్టెన్ సంజూ శాంసన్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు రాజస్థాన్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే.. సంజూ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొన్ని రోజులు ప్రయాణాలు చేయకూడదని డాక్టర్లు సూచించారు. దాంతో, చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరిగే మ్యాచ్ కోసం అతడు జట్టుతో పాటు బెంగళూరుకు వెళ్లడం లేదు. ఒకరకంగా ఇది మాకు పెద్ద ఎదురుదెబ్బ. శాంసన్ రోజు రోజుకు మెరుగవుతున్నాడు. త్వరలోనే అతడు టీమ్‌తో కలుస్తాడని ఆశిస్తున్నాం’ అని రాజస్థాన్ యాజమాన్యం తెలిపింది.
🚨 A HUGE SET-BACK FOR RAJASTHAN ROYALS 🚨
– Sanju Samson ruled out of the RCB match on April 24th. pic.twitter.com/EW0LiwvYm3
— Johns. (@CricCrazyJohns) April 21, 2025
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ పొట్టకు గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. అందుకే సొంత గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఆడలేదు అతడు. ఏప్రిల్ 24న ఆర్సీబీతో కీలక మ్యాచ్‌కు అయినా అందుబాటులో ఉంటాడని ఆశించారంతా. కానీ, సంజూ వరుసగా రెండో గేమ్‌కు దూరం కానున్నాడు. దాంతో, బెంగళూరుతో పోరులో రియాన్ పరాగ్ సారథిగా వ్యవహరించనున్నాడు. శాంసన్ స్థానంలో లక్నోపై అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీనే ఆడించే అవకాశముంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచుల్లో ఆరింట ఓడిన రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది. మరోవైపు ఆర్సీబీ 5 విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
🚨 WELCOME TO THE IPL…!!! 🚨
– 14 year old Vaibhav Suryavanshi hits a first ball six on debut. 🍿pic.twitter.com/Q322qxT4qB
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2025