Arrested |వినాయక నగర్,ఏప్రిల్;21 : నిజామాబాద్ లో అంతరాష్ర్ట గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్ రాష్ర్ట ముఠాను సభ్యులైను ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద 30 కేజీల గంజాయితో పాటు ఓ కారు, 2 బైకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్, డిప్యూటీ కమిషనర్ వి.సోమి రెడ్డి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ నిందితుడితోపాటు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మరో నలుగురు గంజాయి స్మగ్లర్లు ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాలలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం తెలిసిందని చెప్పారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు రెక్కీ నిర్వహించి నిజామాబాద్ నగరంలోని గంజి ప్రాంతంతో పాటు నవీపేట్ మండలంలోని ఎంచ వద్ద గంజాయి విక్రయించేందుకు వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ దాడుల్లో నిజామాబాద్ పట్టణంలోని ఆటోనగర్ కు చెందిన మొహమ్మద్ అయూబ్, మహారాష్ట్రలోని నాందేడ్,బోకర్ ప్రాంతాని చెందిన ఫరూక్ ఖురేషీ, షేక్ ఫయీమ్, షేక్ సిద్ధిక్, జుబేర్ పఠాన్ అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుండి
30.250 కిలోల ఎండు గంజాయి తో పాటు ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు మూడు సెల్ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. వాహనాలతో పాటు నిందితులను తదుపరి చర్యల నిమిత్తం నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు డీసీ వెల్లించారు. ఈ ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ స్వప్న, ఎస్ ఐ రాంకుమార్, సిబ్బంది నారాయణరెడ్డి, హమీద్, రాజన్న, రాంబచన్, సుకన్య, ఆశన్న, అవినాష్, శ్యాంసుందర్, సాయికుమార్ ను ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు.