Mumin Dhar : జమ్మూ కశ్మీర్ వెయిట్ లిఫ్టర్ ముమిన్ దార్(Mumin Dhar) చరిత్ర సృష్టించాడు. ‘అత్యంత
బలశాలిగా’ రికార్డు నెలకొల్పాడు. తమ ప్రాంతంలో జరిగిన పవర్ లిఫ్టింగ్, డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్షిప్ 2025లో ముమిన్ ఏకంగా 663.5 కిలోల బరువులు ఎత్తి ఔరా అనిపించాడు. దాంతో, జమ్ముకశ్మీర్‌లోని స్ట్రాంగెస్ట్ మ్యాన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడీ 23 ఏళ్ల లిఫ్టర్.
సీనియర్, జూనియర్.. రెండు విభాగాల్లో పోటీపడిన ముమిన్ రికార్డు స్థాయిలో బరువులెత్తాడు. మొదట స్క్వాట్ పొజిషన్లో 241 కిలోలు ఎత్తిన ముమిన్.. బెంచ్ ప్రెస్‌లో 172.5 కిలోల్ని అలవోకగా మోశాడు. ఆ తర్వాత కీలమైన డెడ్లిఫ్ట్లోనూ ఏమాత్రం తొణకకుండా 250 కిలోల బరువు మోసిన అతడు మొత్తంగా 663.5 కిలోలతో సరికొత్త చరిత్ర లిఖించాడు. తాను సాధించిన ఈ ఘతన పట్ల సంతోషం వ్యక్తం చేసిన ముమిన్.. టైటిల్ గెలుపొందడం గర్వంగా ఉందని చెప్పాడు.
‘వెయిట్ లిఫ్టింగ్‌లో రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉంది. జమ్ముకశ్మీర్‌లోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్‌గా పేరొందడం నిజంగా నాకెంతో గర్వకారణం. నాతో పాటు చీనాబ్ లోయ వాసులంతా గర్వపడే క్షణమిది. ఈ టైటిల్ విజయం వెనక కొన్నేళ్ల శ్రమ దాగి ఉంది. ఈ స్థాయికి రావడానికి ఎన్నో త్యాగాలు చేశాను. ఈ విజయాన్ని మా ప్రాంతంలోని యువతకు అంకితం చేస్తున్నా. నన్ను స్ఫూర్తిగా తీసుకొని వాళ్లు తమ అభిరుచుల్లో రాణించాలని కోరుకుంటున్నా’ అని వెల్లడించాడీ పవర్ లిఫ్టర్.
Mumin Dar Crowned ‘Strongman of J&K’ After Record-Breaking Powerlifting Performance https://t.co/tofpMhCSrt
— The Chenab Times (@TheChenabTimes) April 21, 2025