Prajavani| మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 21 : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుండి 106 ఫిర్యాదులను కలెక్టరేట్ అందుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ.. సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ హరిప్రియ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం